Friday, 19 June 2026 05:14:03 AM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

రెండు రోజుల్లో ఈ ఫాస్టాగ్‌ సేవలు బంద్

ప్రత్యామ్నాయం  చూసుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ సూచన

Date : 13 March 2024 11:26 PM Views : 1078

Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : మరో రెండు రోజుల్లో పేటీఎం ఫాస్టాగ్‌ సేవలు నిలిచిపోనున్నాయి. ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించిన ఆర్బిఐ మరోసారి పొడిగించే అవకాశం లేదని ప్రకటించడంతో పేటీఎం ఫాస్టాగ్‌ సేవలు రెండు రోజుల్లో నిలిచిపోయే అవకాశం ఉంది. పేటీఎం ఫాస్టాగ్‌ యూజర్లకు ఎన్‌హెచ్‌ఏఐ బుధవారం కీలక సూచన చేసింది. వినియోగదారులు వెంటనే ఇతర ఫాస్టాగ్‌ సంస్థలకు మారిపోవాలని కోరింది. పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌ కి భారతీయ రిజర్వు బ్యాంక్‌  ఇచ్చిన గడువు మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. దానివల్ల ప్రయాణ సమయంలో టోల్‌ప్లాజాల వద్ద ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవని తెలిపింది. పేటీఎంపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించడంతో గత నెలలో ఫాస్టాగ్ జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను భారతీయ రహదారుల నిర్వహణ కంపెనీ  తొలగించింది.

Also Read : లారీ కిందవడి డెలివరీ బాయ్ మృతి

ఇకపై ఐహెచ్‌ఎంసీఎల్‌ పేర్కొన్న జాబితాలో ఉన్న బ్యాంకుల నుంచే ఫాస్టాగ్‌ కొనుగోలు చేయాలని యూజర్లకు సూచించింది. పీపీబీఎల్‌పై ఆర్‌బీఐ విధించిన ఆంక్షలు మార్చి 15 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఒకసారి గడువు తేదీని పొడిగించారు. ఈసారి అలాంటి ఉద్దేశమేదీ లేదని ఇప్పటికే ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. దీంతో పీపీబీఎల్‌, పేటీఎం వాలెట్‌, క్యాష్‌బ్యాక్‌, రిఫండ్‌, డిపాజిట్‌, ఫాస్టాగ్‌ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయం  చూసుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ యూజర్లకు సూచించింది. 

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: