Friday, 19 June 2026 03:48:42 AM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

శృతి మించిన కాంగ్రెస్ జూబ్లీహిల్స్ విజయోత్సవ సంబరాలు (వీడియో)

Date : 14 November 2025 10:48 PM Views : 479

Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో ఉత్కంఠ భరితంగా సాగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికల విజయం అనంతరం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయోత్సవ సంబరాలు శ్రుతిమించాయి. శుక్రవారం నిర్వహించిన ఓట్ల కౌంటింగ్ అనంతరం గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తును క్రేనుకు వేలాడదీసి ఊరేగింపు నిర్వహించడం.. కారును పల్టీలు కొట్టించి ధ్వంసం చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కారుపై ఓవైపు కేసీఆర్, ఓవైపు కేటీఆర్ పేర్లతో గులాబీ రంగు తో ఉన్న కారును క్రేనుకు వేలాడదీస్తూ.. పల్టీలు కొట్టించి... అందులో నుంచి మనుషులు కింద పడుతున్నట్లుగా చిత్రీకరిస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమైనా, ప్రత్యర్థి పార్టీ గుర్తును ఈ విధంగా అవమానించడం ఎంతవరకు సమంజసం అని పలువురు ప్రశ్నిస్తున్నారు. విజయోత్సవ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు వ్యవహరించిన తీరు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వారి వ్యవహార శైలిని బహిర్గతం చేసిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు.

Also Read : ఆముదం గింజల నుండి 'రిసిన్' విషం

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: