Friday, 19 June 2026 05:17:14 AM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

తెలంగాణలో రైతు, ఎడ్యుకేషన్ కమిషన్లు ఏర్పాటు చేస్తాం : ముఖ్యమంత్రి

పౌర సమాజం ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం

Date : 01 March 2024 08:24 PM Views : 955

Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్లను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. త్వరలోనే రెండు కమిషన్లను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలోని పౌర సమాజం ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని అన్నారు. ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో 25 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ లో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎఎస్సీ ద్వారా నియామకాలు చేపడతామని అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న చిక్కుముడులు తొలగించి ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.

Also Read : శిల్పారామంకు పూర్వ వైభవం తీసుకువస్తాం: మంత్రి జూపల్లి

రైతు కమిషన్ వ్యవసాయ రంగం, రైతుల సంక్షేమనికి సంబంధించిన సలహాలు, సమీక్ష చేపడుతుందన్నారు. రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయబోతున్నామని తెలిపారు. కౌలు రైతుల రక్షణకు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, అందరి సూచనలు, సలహాలు ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం తీసుకురావాలని యోచిస్తున్నామని అన్నారు. రైతు భరోసా అనేది పెట్టుబడి సాయమని, రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని కోరుతున్నామన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: