Friday, 19 June 2026 05:16:49 AM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

దుర్గం చెరువులో దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య

ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం

Date : 27 July 2024 12:25 AM Views : 976

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : రోజు మాదిరిగానే ఉత్సాహంగా కార్యాలయానికి వెళ్లిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తాను పనిచేస్తున్న సాఫ్ట్వేర్ సంస్థ నుంచి బయటకు వచ్చి దుర్గం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం సాఫ్ట్వేర్ ఉద్యోగి కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేయగా, సాయంత్రానికి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియడం విషాదాన్ని నింపింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ వరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు... ముషిరాబాద్ కు చెందిన ఎం. బాలాజీ(25) నాలెడ్జ్ సిటీలోని ఐటీ సంస్థ లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.  ఈనెల 24వ తేదీన ఉదయం ఆఫీసుకు వచ్చిన బాలాజీ అర్ధరాత్రి ఐనా తిరిగి ఇంటికి రాలేదు. స్నేహితుల వద్ద విచారించిన కుటుంబ సభ్యులు బాలాజీ ఆచూకీ లభించకపోవడంతో 25వ తేదీన తెల్లవారు జామున రాయదుర్గం పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు.

Also Read : ఐటీ కారిడార్ నడిబొడ్డున డ్రగ్స్, విదేశీ మద్యంతో 'రేవ్ పార్టీ

పోలీసులు ఐటీ కంపెనీలో విచారించగా 24వ తేదీ రాత్రి 8.30కు బయటకు వెళ్లినట్టు గుర్తించారు. స్థానిక సీసీ కెమెరాలను పరిశీలిస్తే మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదుగా కిందకు దిగినట్టు గుర్తించారు. ఓ వైపు పోలీసులు బాలాజీ కోసం గాలిస్తుండగా, శుక్రవారం సాయంత్రం బాలాజీ మృతదేహం దుర్గం చెరువు నీటిలో కనిపించింది. మెడలో ఉన్న ఐడి కార్డు ఆధారంగా బాలాజీ గా గుర్తించారు. ప్రేమ వ్యవహారమే బాలాజీ ఆత్మహత్య కు కారణమని అనుమానిస్తున్నారు. బాలాజీ కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడని, యువతి పెళ్ళికొసం ఒత్తిడి చేయగా, తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పలేక బాలాజీ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: