Friday, 19 June 2026 05:12:10 AM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

విదేశాలకు పారిపోయిన గచ్చిబౌలి డ్రగ్స్ నిందితుడు

Date : 29 February 2024 09:43 PM Views : 865

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన గచ్చిబౌలి డ్రగ్స్ పార్టీ కేసు లో మరో టర్నింగ్ పాయింట్... ఓవైపు పోలీసులు అజ్ఞాతంలో ఉన్న నిందితుల కోసం నోటీసులు జారీ చేసి గాలింపు చేపడుతుండగా, మరోవైపు కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి నీల్ విదేశాలకు పారిపోవడం మరింత సంచలనంగా మారింది.  గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో మొత్తం పదిమంది పాల్గొనగా ఫిబ్రవరి 25వ తేదీన డ్రగ్స్ పార్టీ నిర్వహించిన వివేకానందను, సినీ నిర్మాత కేదారినాథ్, వ్యాపారి నిర్భయ్ లను అరెస్టు చేశారు. అనంతరం వీరికి కొకైన్ సరఫరా చేసిన అబ్బాస్ ను అరెస్టు చేయగా, బుధవారం అబ్బాస్ కు డ్రగ్స్ ఇచ్చిన వహీద్ బేగ్ ను, వివేకానంద కు డ్రగ్స్ చేరవేయడంలో సహాయం చేసిన అతని డ్రైవర్ ప్రవీణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు రఘు చరణ్ గురువారం పోలీసు విచారణకు హాజరయ్యాడు.

Also Read : సింగర్ చిన్మయి మీద గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో పిర్యాదు

కాగా ఈ కేసులో ప్రముఖ దర్శకుడు క్రిష్, నటి లిషి గణేశా, యూట్యూబర్ శ్వేత, సందీప్, నీల్ లు పరారీలో ఉండగా పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ మేరకు వీరికి 160 సీఆర్పిసీ నోటీసులు జారీ చేశారు. కాగా నిందితులల్లో ఒకరైన నీల్ విదేశాలకు పారిపోయినట్టు తెలుసుకొని పోలీసులు కంగుతిన్నారు. నీల్ దేశం దాటడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు లో నిందితుడు మొదట రాష్ట్రం దాటడం, ఇప్పుడు దేశం దాటి పోవడం సంచలనంగా మారింది. నీల్ దేశం దాటడానికి ఎవరు సహకరించారు, ఎవరి మద్దతుతో నీల్ దేశం దాటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: