Friday, 19 June 2026 05:11:29 AM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

'ఉడతా సైబరాబాద్' - విద్యార్థులు, ఉద్యోగులే టార్గెట్

ఐటీ కారిడార్ లో కిరాణా షాపుల్లో గంజాయి ప్యాకెట్లు

Date : 01 April 2024 09:45 PM Views : 1046

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : కట్టుదిట్టమైన భద్రత మధ్య, బహుళజాతి సంస్థలతో అలరారే గచ్చిబౌలి ఐటీ కారిడార్ ఉడతా సైబరాబాద్ గా మారుతోంది. నిరంతర నిఘా, పటిష్టమైన బందోబస్తు ఉండే ఐటీ కారిడార్ లో నిత్యావసర వస్తువుల కంటే విరివిగా గంజాయి లభిస్తుంది. ఐటీ కారిడార్ లో చిన్న చిన్న హోటళ్లు, కిరాణా షాపులు గంజాయి కేంద్రాలుగా మారుతున్నాయి. ఐటీ కారిడార్ లో తరచూ వెలుగుచూస్తున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతకొన్ని రోజుల క్రితమే లేడీ గంజాయి డాన్ ను పోలీసులు అరెస్టు చేయగా, తాజాగా మరో మహిళ గంజాయి విక్రయిస్తూ పట్టుబడింది. కిరాణా షాపును స్థావరంగా మార్చుకుని విద్యార్థులు, ఉద్యోగులకు గంజాయి విక్రయిస్తుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం...

Also Read : తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే పార్టీ బిజెపి : కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

గచ్చిబౌలి ఐటీ కారిడార్ పరిధిలోని నానక్ రాంగూడ లోథా బస్తీలో నివాసం ఉండే అనురాధా భాయి(39) తన కిరాణా షాపులో గంజాయి అమ్ముతుంది. దుకాణం నిర్వహిస్తుంది. దూల్ పేట నుంచి పెద్దమొత్తంలో గంజాయి తీసుకువచ్చి, చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఎక్కువ ధరకు స్థానికంగా విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలకు విక్రయించసాగింది. అనురాధా భాయి గంజాయి వ్యాపారంపై సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు కిరాణా దుకాణం మీద దాడి చేశారు. ఈ దాడిలో 20వేల రూపాయల విలువైన 300 గ్రాముల(39 ప్యాకెట్లు) గంజాయిని, నగదు, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు అనురాధాభాయిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: