Friday, 19 June 2026 03:48:42 AM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

రాయదుర్గం నాగాహిల్స్ ప్లాట్లపై మరోసారి వివాదం

నిర్మాణ సంస్థతో కలిసి అసోసియేషన్ సభ్యులు కబ్జాకు పాల్పడుతున్నారని యజమానుల ఆందోళన

Date : 06 August 2024 10:15 PM Views : 3303

Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : రాయదుర్గం నాగాహిల్స్ లే అవుట్ ప్లాట్లపై మరోసారి వివాదం చెలరేగింది. ఎన్నోఏళ్లుగా తమ ప్లాట్ల కోసం కోర్టుల చుట్టూ తిరిగి, చివరికి కోర్టు తమకు అనుకూలంగా తీర్పు వెల్లడించినా తమ సొంత అసోసియేషన్ రూపంలో తమకు తిరిగి కష్టాలు మొదలయ్యాయని పలువురు ప్లాట్ల యజమానులు ఆందోళన చేపట్టారు. తమ ప్లాట్ల కబ్జా, అసోసియేషన్ సభ్యుల దౌర్జన్యం మీద ప్లాట్ల యజమానులు రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు మంగళవారం నాగాహిల్స్ లే అవుట్ వద్ద ఆందోళన చేపట్టిన పలువురు యజమానులు మాట్లాడుతూ శేరిలింగంపల్లి మండల పరిధిలోని రాయదుర్గం పాన్ మక్తా సర్వే నెంబరు 66/3లో 25ఎకరాల విస్తీర్ణంలో 1984లో నాగాహిల్స్ ఫేజ్2 లేఅవుట్ చేశారని అన్నారు. అందులో మొత్తం 295 ప్లాట్లను యజమానులు కొనుగోలు చేశారని, అనంతర కాలంలో సదరు భూమి ప్రభుత్వ స్థలమంటూ వివాదం కోర్టులో కొనసాగిందని అన్నారు. రోడ్డు విస్తరణలో కొన్ని ప్లాట్లు కోల్పోగా చివరికి 250 ప్లాట్లు మిగిలాయని, గత 10 సంవత్సరాల క్రితం కోర్టు వివాదం పరిష్కారం అయ్యిందని, సదరు భూమి నాగాహిల్స్ ప్లాట్ల యజమానులదేనని కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. కాగా లే అవుట్ చేయకముందు ఉన్న భూయజమాని వారసులను అడ్డుపెట్టి నాగా హిల్స్ అసోసియేషన్ సభ్యులు కొత్త కుట్రకు తెరలేపారని వాపోయారు.

Also Read : యువత చూపు కాంగ్రెస్ వైపు : శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్

తాము సూచించిన నిర్మాణ సంస్థకు ప్లాట్లను డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, ఇప్పటికే చాలా వరకు యజమానులు అగ్రిమెంట్ చేసుకోగా, 25మంది యజమానులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారని అన్నారు. తమ మధ్య ఈ వివాదం కొనసాగుతుండగా, తాజాగా తమ ప్లాట్లను ఆక్రమించి లే అవుట్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని వాపోయారు. ప్రశ్నిస్తే తమ మీద దౌర్జన్యం చేస్తున్నారని, ప్రైవేట్ సైన్యంతో బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ విషయమై పలుమార్లు రాయదుర్గం పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశామని, తాజాగా సోమవారం మరోసారి పిర్యాదు చేసినట్లు తెలిపారు. అధికారులు, పోలీసులు కల్పించుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో జిఎస్ఎస్. రాజు, రవి, అచ్చుతరామారావు, సుధాకర్రెడ్డి, శ్రీనివాస్ చారి, దినకర్ తదితరులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: