Friday, 19 June 2026 03:53:39 AM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

కాలిపోయిన మృతదేహాలను చూసేందుకు సౌదీ వరకు వెళ్లాలా

తెలంగాణ ఉర్దూ అకాడమీ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు

Date : 18 November 2025 05:36 PM Views : 253

Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : "కాలిపోయిన మృతదేహాలను చూసేందుకు సౌదీ అరేబియా వరకు వెళ్లడం ఎందుకు...? ఈ మాటలు అన్నది తెలంగాణ ప్రభుత్వంలో బాధ్యతాయుత స్థానంలో ఉన్న ఓ వ్యక్తి. మన రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్రాల్లో లేదా ఇతర దేశాల్లో మరణిస్తే మరణించిన వారి కుటుంబానికి అండగా నిలవడం, సహాయ సహకారాలు అందించడం ప్రభుత్వ కనీస బాధ్యత. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం మరణించిన వారికి ఎక్స్ గ్రేషియాతో పాటు వారి కుటుంబాల నుంచి ఇద్దరు చొప్పున సౌదీ అరేబియా పంపించేందుకు ఏర్పాటు చేస్తుండగా, మరోవైపు మరణించిన వారిని, వారి కుటుంబ సభ్యులను అవమానించేలా మాట్లాడాడు తెలంగాణ ఉర్దూ అకాడమీ డైరెక్టర్. సౌదీలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వీళ్లంతా హైదరాబాద్ వాసులేనని తెలంగాణ హజ్ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. మృతి చెందిన వారిలో 17 మంది పురుషులు, 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్లు పేర్కొంది. మొత్తం నాలుగు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా ఈనెల 9న హైదరాబాద్ నుంచి వీరంతా ఉమ్రాకు బయల్దేరారు. విజయవంతంగా మక్కా యాత్ర పూర్తిచేసుకుని మదీనాకు వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది.

Also Read : మీడియా'తో సంబంధాలు కలిగి ఉండడం నిబంధనల ఉల్లంఘనా..?

మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో బస్సు-డీజిల్ ట్యాంకర్ ఢీకొన్నాయి. బస్సు కు పెద్ద ఎత్తున మంటలు అంటుకొని అందులో ఉన్న 45 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. చనిపోయిన వారి కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు మత సాంప్రదాయాల ప్రకారం అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని ఇందుకోసం బాధిత ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరు చొప్పున కుటుంబ సభ్యులను సౌదీ అరేబియా తీసుకు వెళ్ళేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. కాగా బాధిత కుటుంబ సభ్యులతో జరిగిన సమావేశం సందర్భంగా తెలంగాణ ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మహమ్మద్ సఫియుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాలిపోయిన మృతదేహాలను చూసేందుకు అక్కడి వరకు వెళ్లాలా అంటూ, మృతుల కుటుంబ సభ్యులను అవమానించే విధంగా మహమ్మద్ సఫియుల్లా మాట్లాడడంతో పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: