Friday, 19 June 2026 03:51:40 AM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బిఆర్ఎస్ శ్రేణులు పనిచేయాలి : కొమిరిశెట్టి సాయిబాబా

గచ్చిబౌలి డివిజన్ బిఆర్ఎస్ ముఖ్య నాయకులు, బూత్ కమిటీల సమావేశం

Date : 25 April 2024 08:29 PM Views : 3644

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : రానున్న పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా గచ్చిబౌలి డివిజన్ పార్టీ శ్రేణులు పనిచేయాలని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారం నేపద్యంలో గురువారం ఖాజాగూడలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో డివిజన్ ముఖ్య నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలతో సాయిబాబా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Also Read : కర్ణాటక నుంచి తెలంగాణకు డీజిల్ స్మగ్లింగ్

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ప్రజలు బిఆర్ఎస్ పక్షానే ఉన్నారని, పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ కు శేరిలింగంపల్లి నుంచి భారీ మెజారిటీ రావడం ఖాయమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. మాజీ కార్పొరేటర్ సాయిబాబా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రాజు నాయక్, నాయకులు దారుగుపల్లి నరేష్, శంకరి రాజు ముదిరాజ్ లతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: