Friday, 19 June 2026 05:12:10 AM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

ఖాజాగూడ స్కూల్ విద్యార్థులు ఉత్తమంగా రాణించాలి : సాయిబాబా

10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి ఆందజేత

Date : 16 March 2024 06:06 PM Views : 650

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న ఖాజాగూడ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అభిలాషించారు. ప్రతి విద్యార్థి జీవితంలో 10వ తరగతి ఎంతో కీలకమని, భవిష్యత్తు లో మన జీవితం ఏ దిశలో సాగాలో నిర్ణయించేది పదవ తరగతి అని అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి సాయిబాబా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Also Read : తెలంగాణలో మే 13న పార్లమెంటు ఎన్నికల పోలింగ్

ఈ సందర్భంగా కొమిరిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని అందజేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ ఖాజాగూడ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేసి, అల్ ది బెస్ట్ చెప్పడం ప్రతిసంవత్సరం ఆనవాయితీగా వస్తుందన్నారు. పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని, చదువుకున్న పాఠశాలకు, విద్య చెప్పిన గురువులకు, కన్న తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ రాజశేఖర్ రెడ్డి, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ శ్యామల, మని మాధురి, వెంకట్ రామ్ రెడ్డి, నరహరి, శ్రీనివాస్ రెడ్డితో పాటు నాయకులు నరేష్, అంజమ్మ, రాజు ముదిరాజ్, రమేష్ గౌడ్, బాలమణి తదితరులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: