Friday, 19 June 2026 05:21:30 AM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

సున్నం చెరువు హైడ్రా కూల్చివేత బాధితులతో బీఆర్ఎస్ దీపావళి వేడుకలు

వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి పాల్గొన్న కొమిరిశెట్టి సాయిబాబా

Date : 20 October 2025 08:13 PM Views : 420

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : దీప కాంతుల దీపావళి వేడుకలను బీఆర్ఎస్ నాయకులు వినూత్నంగా జరుపుకున్నారు. మాదాపూర్ సున్నం చెరువు హైడ్రా కూల్చివేత బాధితులతో కలిసి ఈ దీపావళి సెలబ్రేషన్స్ ను సోమవారం చేసుకున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు గత కొన్ని రోజుల క్రితం కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ కూల్చివేతల కారణంగా పలువురు పేదలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. దీంతో దీపావళి వేడుకలను సోమవారం బీఆర్ఎస్ నాయకులు సున్నం చెరువు బాధితులతో కలిసి చేసుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి. రామారావు, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజులతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ నాయకులు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా సోమవారం సున్నం చెరువు బాధితులను కలిశారు. సున్నం చెరువు బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కేటీఆర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Also Read : ఆక్రమ క్రషర్లు, మిక్సింగ్ ప్లాంట్లను స్పెషల్ టీమ్ అడ్డుకునేనా.. ?

అనంతరం సాయిబాబా మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్న పేదలను రాత్రికి రాత్రే కట్టుబట్టలతో రోడ్డున పడవేయడం హేమన్నారు. పేదలపై ప్రతాపం చూపిస్తున్న హైడ్రా కు ప్రభుత్వ భూములు ఆక్రమించిన పెద్దలపై ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. గూడు లేక ఇబ్బందులు పడుతున్న పేదలతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోవాలనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆలోచన అభినందనీయమన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సున్నం చెరువు బాధితులకు శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు అండగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సున్నం చెరువు బాధితులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: