Friday, 19 June 2026 05:17:41 AM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

ఘనంగా అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు

సమాజ సేవే ధ్యేయంగా ముందుకు సాగుతా : అనీల్ కుమార్ యాదవ్

Date : 22 October 2025 08:25 PM Views : 377

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. శేరిలింగంపల్లి నియోజక వర్గం పరిధిలోని మజీద్ బండ లో గల అనిల్ కుమార్ యాదవ్ నివాసం వద్ద ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకలకు పలువురు ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ కు పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా యువజన నాయకులు భారీ పూలహారాన్ని అనిల్ కుమార్ యాదవ్ కు వేయడం ప్రత్యేకతగా నిలిచింది.

Also Read : టెక్ దిగ్గజ కార్యాలయంలో నల్లుల బెడద

అనంతరం అనిల్ కుమార్ యాదవ్ ఆటో యూనియన్ కార్మికులకు యూనిఫామ్ లను అందజేశారు. అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ సమాజసేవే ధ్యేయంగా ముందుకు సాగుతానని అన్నారు. ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతి కోసం రాజకీయాలకు ఆతీతంగా కృషి చేస్తానని తెలిపారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అనిల్ కుమార్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఉన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: